తమిళ్ లో విజయ్ సేతుపతి హీరోగా త్రిష హీరోయిన్ గా తెరకెక్కిన “96” చిత్రానికి రీమేక్ తెరకెక్కిన “జాను” చిత్రం అంతే టాక్  తో టాలీవుడ్ నుంచి విడుదలయ్యింది.మరి ఈ చిత్రం ఎంతవరకు ఆడియన్స్ ని ఆకట్టుకుందో ఇప్పుడు రివ్యూలోకి వెళ్లి తెలుసుకుందాం .శర్వానంద్ హీరోగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్  హీరోయిన్ సమంత గా సి ప్రేమ్ కుమార్తె డైరెక్షన్లో తేరకెక్కించిన ఎమోషనల్ లవ్ స్టోరీ  చిత్రం “జాను”.

కథ :

ఈ కధనంలో తన చిన్ననాటి స్నేహితులు అంతా కలిసి ఒక గెట్ టు గేదర్ ను ఏర్పాటు చెయ్యగా అక్కడికి జాను కూడా వస్తుంది.కథలోకి వెళ్లినట్టయితే రామ్(హీరో ) ఓ వైల్డ్ లైఫ్ ఫోటో గ్రాఫర్.కొన్ని పరిస్థితుల రీత్యా తాను చదువుకున్న స్కూల్ దగ్గరకు వెళ్లాల్సి వస్తుంది ఒకప్పుడు ఒకే క్లాస్ స్కూల్ కు చెందిన జాను మరియు రామ్ ల మధ్య జరిగిన స్టోరీ ఏమిటి? వారు ఎందుకు విడిపోవాల్సి వచ్చింది.వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ఏ స్థాయిలో ఆకట్టుకుంది అన్నది తెలియాలి అంటే ఈ ఎమోషనల్ లవ్ డ్రామాను వెండితెర మీద చూడాల్సిందే.చాలా కాలం తర్వాత కలిసిన వీరిద్దరికి ఎలాంటి పరిస్థితులు  ఎదురయ్యాయి?అప్పుడు లవ్ చేసుకున్న వీళ్ళ ప్రేమకు ముగింపు ఎలా ఇచ్చారు ?

విశ్లేషణ :

మంచి ఎమోషనల్ లవ్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి రీమేక్ గా తెలుగులో కూడా మంచి అవుట్ ఫుట్ ఇచ్చే ప్రయత్నమే ఈ “జాను”.తమిళ్ లో 96 గా విడుదల కాబడిన ఈ చిత్రం అద్భుతమైన సక్సెస్ ని సొంతం చేసుకుంది.ఎలాగో ఫలితం ఒకేలా ఉంటుంది కానీ దానిని మన నేటివిటీకి తగ్గుట్టుగా ఎలా తెరకెక్కించారు అన్నది ప్రశ్న. ముఖ్యంగా ఆల్రెడీ ఎమోషనల్ హిట్ గా నిలిచిన ఈ చిత్రం మన దగ్గర కూడా అదే దర్శకుడితో ప్లాన్ చెయ్యడం వల్ల  సినిమా ఫలితాన్ని అందుకోకుండా ఉంటుంది అనుకోలేం.

కానీ తమిళ్ లో ఈ చిత్రాన్ని కానీ ఫాలో అవ్వని వారికి “జాను” ఖచ్చితంగా ఒక అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది.అలా ఈ చిత్రం మన నేటివిటీకి తగ్గుట్టుగా దర్శకుడు సి ప్రేమ్ కుమార్ తెరకెక్కించారు.ఇప్పటికే 96 చిత్రాన్ని చూసేసిన వారికి ఈ సినిమా పెద్ద గొప్పగా అనిపించకపోవచ్చు.ఎందుకంటే చాలా మంది ఈ రీమేక్ కూడా బాగున్నా దాని ఒరిజినల్ వెర్షన్ వైపే మొగ్గు చూపుతారు ముఖ్యంగా కథ మొత్తం శర్వానంద్ అండ్ సంమంటల చుట్టూ తిరుగుతూ ఉంది .

అలాగే ఫ్లాష్ బ్యాక్ లోని పాఠశాల ఎపిసోడ్స్ కానీ చాలా నీట్ గా వచ్చాయి.వీరిద్దరి మధ్య వచ్చే కొన్ని ప్రేమ సన్నివేశాలు మరియు ఎమోషనల్ సన్నివేశాలు అయితే మంచి లవ్ జోనర్  సినిమాలను ఇష్టపడే వారికి ట్రీట్ లా ఉంటాయి.అంతలా వీరి కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది.దీని మూలాన అక్కడక్కడా కాస్త బోర్ అనిపించొచ్చు.అయితే సినిమా అంతా లవ్ అనే ఎమోషన్ లో కొత్త కోణాన్ని చూపించినా అది అలా స్లొ గ  సాగుతున్నట్టు అనిపిస్తుంది.

.ఇక డైరెక్టర్  పని తీరుకు వచ్చినట్టయితే తమిళ్ లో ఇప్పటికే తెరకెక్కించిన దర్శకునికి తెలుగులో కూడా అదే స్థాయి అవుట్ ఫుట్ ను రాబట్టడం పెద్ద కష్టంగా అనిపించదు.నటన పరంగా అయితే వీరిని ఎక్కడా తక్కువ చెయ్యడానికి లేదు.అలాగే తనకు కావాల్సింది అంతా రాబట్టుకున్నారు.ఎమోషన్స్, కెమిస్ట్రీ, నటన ఇలా అన్ని కోణాల్లోనూ సినిమాకు తగ్గట్టుగా తీర్చి దిద్దారు .

అలాగే జయరాజు అందించిన సినిమాటోగ్రఫీలోని మ్యాజిక్ శర్వాను పరిచయం చేసిన ఫస్ట్ షాట్ తోనే మొదలవుతుంది.అలాగే గోవింద్ వసంత అందించిన పాటలు కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సినిమాకు మరింత జీవం పోశాయి.అయితే తెరకెక్కించిన విధానంలో ఇంకా కొన్ని మేజర్ గా కాకపోయినా చిన్న మార్పులు చేసి ఉండాల్సింది.సినిమా సోల్ ను దెబ తియ్యకుండా చేసిన ప్రయత్నంలో కథనాన్ని నెమ్మదిగా కాకుండా చిన్నగా స్పీడప్ చేస్తే బాగుండేది.

ప్లస్ పాయింట్స్ :

శర్వా మరియు సమంతల కెమిస్ట్రీ

బ్యాక్గ్రౌండ్ స్కోర్

కథాంశం

మైనస్ పాయింట్స్ :

నెమ్మదిగా సాగే కథనం

పెద్దగా కమెర్షియల్ హంగులు లేకపోవడం

తీర్పు :

అలాగే కాస్త స్లో గా సాగే కథనం ఒరిజినల్ వెర్షన్ నుంచి బయటకు రాని వారికి అయితే అంత గొప్పగా అనిపించకపోవచ్చు.ఇక మొత్తంగా చూసుకున్నట్టయతే శర్వానంద్ మరియు సమంతల కాంబోలో ప్రేమ్ కుమార్ తెరక్కించిన ఎమోషనల్ లవ్ డ్రామా “జాను” ఆకట్టుకునే లవ్ ట్రాక్,ప్రధానపాత్రదారుల మధ్య కెమిస్ట్రీ మరియు ఎమోషన్స్ తో ఇప్పటి వరకు దీని యాసిటిస్  “96”ను చూడని వారికి మాత్రం తప్పకుండా ఒక మంచి ఫ్రెష్ అనుభూతిని కలిగిస్తుంది.

kajol agarwal and samanta movies