1. DISCO RAJA RATING.3/5

ఒక సినిమాకి  ప్రారంభం ఓ సంఘటన ముగింపు – ఇవి ప‌క్కాగా ప్లాన్ చేసుకుంటే చాలు. క‌థ‌కి ఇవి చాలా అవ‌స‌రం కూడా. క‌థ‌లోకి న‌డిపించే ప్రారంభం, ఆసక్తిక‌ర‌మైన మిడ్ బ్యాంగు, చివ‌ర్లో అదిరిపోయే ట్విస్టుతో ముగింపు –సినిమా క‌థ‌లోనూ ఇవ‌న్నీ క‌నిపించాయి. అయితే మ‌ధ్య‌లో సినిమాకి అతిముఖ్య‌మైన సంఘటన ఉంటుంది. దాన్ని నిర్ల‌క్ష్యం చేస్తే మాత్రం – సినిమాకి కావలసిన  ప్రారంభం, ట్విస్టు, ముగింపు – ఇవ‌న్నీ నీరుగారిపోతాయన‌డానికి ఈ సినిమా ఓ తాజా ఉదాహ‌ర‌ణ‌గా నిలిచిపోయింది.

స్టోరీ లైన్  ల‌ఢ‌క్‌లో, మంచు కొండ‌ల్లో.గుర్తుపట్టలేని ఓ మృత‌దేహం దొరుకుతుంది. దాన్ని శాస్త్ర‌వేత్త‌లు లాబ్‌కి తీసుకువస్తారు . త‌మ ప్ర‌యోగాల‌కు `ల్యాబ్ ప్రయోగములా వాడుకుంటారు. దేవుడి క్రియేట్ కి పునః సృష్టి చేసి,ప్రాణంపోస్తారు . కానీ.. త‌న‌కేం గుర్తుండ‌దు. త‌నెవ‌రు? ఎక్క‌డి నుంచి వ‌చ్చాడు? అనే విష‌యాలు ఓ మిస్ట‌రీగా మార‌తాయి. అయితే.. ఢిల్లీలో వాసు (హీరో ) కూడా ఎవ‌రికీ క‌నిపించ‌కుండా పోతాడు. త‌న కోసం కుటుంబం మొత్తం దిగులు  పెట్టుకుంటుంది. వాసు కోసం ఓ గ్యాంగ్ గాలిస్తూ ఉంటుంది. ఆ వాసుకీ, శాస్త్ర‌వేత్త‌లు బ‌తికించిన మ‌నిషీ ఒక్క‌రేనా? వేర్వేరు అయితే ఇద్ద‌రి మ‌ధ్య అనుబంధం ఏమిటి? ముఫ్ఫై ఏళ్ల క్రితం చెన్నైలో గ్యాంగ్ స్ట‌ర్ గా వెలిగిన `డిస్కోరాజా` క‌థేమిటి? అత‌ని కోసం సేతు (విలన్ ) ఎందుకు ఎదురు చూస్తున్నాడు? ఇవ‌న్నీ `సినిమా ` చూసి తెలుసుకోవాలి.

 

 

  1. విశ్లేష‌ణ‌

  2. మొదట చెప్పిన‌ట్టు డైరెక్టర్ విఐ ఆనంద్‌… ఈ స్టోరీకి  ప్రారంభం, ఇంట్ర‌వెల్ ,క్లైమాక్స్  చాలా చ‌క్క‌గా రాసుకున్నాడు. ల‌ఢ‌క్ నేప‌థ్యంలో క‌థ‌ని మొద‌లెట్టిన దారి ఆక‌ట్టుకుంటుంది. మంచు కొండ‌లు, అక్క‌డో మృత‌దేహాం, దాన్ని ప్రయోగశాలకి  త‌ర‌లించ‌డం, ప్ర‌యోగాలు చేయ‌డం – ఇదంతా ప్రేక్ష‌కుడిని తొంద‌ర‌గానే క‌థ‌లోకి తీసుకెళ్లిపోతుంది. ఇంట్ర‌వెల్ బ్యాంగ్ కూడా ప‌క‌డ్బందీగా రాసుకున్నాడు. కానీ మ‌ధ్య‌లో న‌డిచే విధానం  అంత ఆస‌క్తిగా అనిపించ‌దు. ఎందుకో ర‌వితేజ ఎన‌ర్జీని కాస్త ల్యాబ్ కె పరిమితం చేసి – ద‌ర్శ‌కుడు మ‌రో ప్ర‌యోగం చేసాడు . ర‌వితేజ నుంచి ఆశించే వినోదం.. అంట కనిపించదు క‌నిపించ‌దు. అయితే వాసు – న‌భా ఎపిసోడ్‌లో పూర్వపు ర‌వితేజ‌ని చూపించే ఛాన్సుంది. దాన్నీ ఆనంద్ స‌ద్వినియోగం చేసుకోలేదు. ఆ ట్రాక్‌ని కాస్త లాజిక్కులు మిస్ అయ్యారు . ఉగాదిలో ఎస్‌వీ కృష్ణారెడ్డి చేసిన పార్ట్‌టైమ్ ఉద్యోగాల‌న్నీ అదే పనిగా `ప్లే` చేసేశాడు. పార్ట్‌టైమ్ లైబ్రేరియ‌న్‌, పార్ట్ టైమ్ మాస్టారు రొటీనే . ఈ పార్ట్ టైమ్ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉద్యోగం ఏమిటో అర్థం కాదు. లాబులో వెన్నెల కిషోర్ వేసిన డైలాగ్ లు అక్క‌డ‌క్క‌డ పేలాయంతే. లేదంటే ఫ‌స్టాఫ్‌ని చూడడం ఇంకాస్త క‌ష్ట‌మ‌య్యేది.అపుడే  ఇంట్ర‌వెల్ బ్యాంగ్ ప‌డుతుంద‌న‌గా – ఓ ట్విస్ట్ ఇచ్చి ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. ఆ మలుపు, దానికి ఇచ్చిన బిల్డ‌ప్పు, వెనుక రెచ్చిపోయి కొట్టిన త‌మ‌న్ ఆర్‌.ఆరూ.. ఇవ‌న్నీ చూస్తే ఈ  ఫ‌స్టాఫ్ వ‌ర‌కే.. సెకండాఫ్ దద్ద‌రిల్లిపోతుంద‌ని అనిపిస్తుంది. ఎందుకంటే టైటిల్ జ‌స్టిఫికేష‌న్‌కి సంబంధించిన డిస్కోరాజా క్యారెక్ట‌రు ద్వితీయార్థంలోనే ఎంట‌ర్ అవుతుంది. కాబ‌ట్టి… ఆ ఆశ‌లు, అంచ‌నాల‌తో ప్రేక్ష‌కుడు కాస్త `విశ్రాంతి` తీసుకుంటాడు. అయితే కీల‌క‌మైన రెట్రో స్కీన్లో నూ ద‌ర్శ‌కుడు త‌డ‌బ‌డిన‌ట్టు అనిపిస్తుంది. విజ‌య్‌సేతుప‌తి – ర‌వితేజ `వార్` ఆస‌క్తిగానే స్టార్ట్ అయినా – చాలా నార్మల్ గ ముగుస్తుంది. బిరియానీ ఎపిసోడ్ పెంచినట్లు అనిపిస్తుంది. ల‌వ్ చాఫ్ట‌ర్ కూడారొటీన్ గా సాగుతుంది. ర‌వితేజ – పాయ‌ల్ మ‌ధ్య ట్రాక్ ఇంకాస్త వెరైటీ గా తీర్చిదిద్దితే బాగుండేది. ఎప్పుడైతే డిస్కోరాజాకి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ ముగుస్తుందో, అప్పుడే క్లైమాక్స్ మ‌న‌కి అర్థ‌మైపోతుంది. సేతుని సైడ్ చేసి – హీరో ప‌గ తీర్చుకుంటాడ‌న్న అంచ‌నాకి ప్రేక్షకుడు వ‌చ్చేస్తాడు. అక్క‌డితో ఈ సినిమాని ఆపేయొచ్చు కూడా. కానీ వీఐ ఆనంద్ క్లైమాక్స్‌ని ఇంకాస్త పొడిగించాల‌నుకున్నాడు. ఓ ట్విస్టు ఇచ్చి – త‌న తెలివితేట‌ల్ని చూపించాడు కూడా. ఆ ట్విస్టు బాగున్నా, అప్ప‌టికే ఈ క‌థ‌తో, డిస్కోరాజాతో ప్రేక్ష‌కుడుసిగ్నెల్ లేకుండా అయిపోతాడు. బ‌య‌ట‌కు వెళ్లిపోవాలనుకున్న ప్రేక్ష‌కుడ్ని కాసేపు ద‌ర్శ‌కుడు ఆపాడు అనుకోవాలి , ఈ సినిమాపై అప్ప‌టికే ఏర్ప‌ర‌చుకున్న అభిప్రాయాన్ని మాత్రం మార్చ‌లేక‌పోయ.
  3. న‌టీన‌టులు

  4. రవితేజ అంటేనే మాస్ లుక్ గుర్తుకువస్తుంది స్టోరీ రొటీన్ గ ఉన్న డాన్ స్టోరీ ఆల్రెడీ చేసిన స్టోరీ నే ఆయన కొన్ని షెడ్ ఉండడం వలన కధని ఒప్పుకొని ఉండొచ్చు . దాన్ని ర‌వితేజ పూర్తి స్థాయిలో సద్వినియోగ‌ప‌ర‌చుకున్నాడు కూడా. త‌ను మ‌రింత యంగ్‌గా క‌నిపించాడు. కానీ ఎన‌ర్జీని మాత్రం చూపించ‌లేక‌పోయాడు. అదంతా ద‌ర్శ‌కుడు అల్లుకున్న స్క్రిప్టులో లోప‌మే త‌ప్ప‌, ర‌వితేజ‌లోనిది కాదు. పాయ‌ల్‌, న‌భా.. ఇద్ద‌రివీ నామ‌మాత్ర‌పు పాత్ర‌లే. పాయ‌ల్ కి డైలాగులు ఇచ్చిన‌ప్పుడే, ఎక్స్‌ప్రెష‌న్స్ ఇచ్చేది కాదు. ఇప్పుడు డైలాగులూ లేవు. ఎక్స్‌ప్రెష‌నూ లేదు. న‌భా.. ఉన్నంత‌సేపూ గ్లామ‌ర్ గానే క‌నిపించింది. సునీల్ ది న‌వ్వించే పాత్ర మాత్రం కాదు. ఇక బాబీ సింహా గురించి చెప్పుకోవాలి. త‌న పాత్ర‌ని చాలా స్టైలీష్‌గా డిజైన్ చేశాడు. త‌న స్క్రీన్ ప్రెజెన్స్ కూడా బాగుంది ఉంది. బాబీ సింహా పాత్ర‌ని ఇంకాస్త ఎలివేట్ చేస్తే, డిస్కోరాజా ఏమైపోతాడో అనే కంగారులో .. కొన్నిచోట్ల  కాస్త అశ్ర‌ద్ధ చేసిన‌ట్టు క‌నిపిస్తుంది.

    సాంకేతిక వ‌ర్గం

  5. ఓకే అనిపించాయి పాటలు , ఆర్‌.ఆర్ మాత్రం గ‌ట్టిగా ఉండాల‌ని త‌మ‌న్‌కి ఒకటికి వంద సార్లు చెప్పరేమో అనిపిస్తుంది కేవ‌లం ఆర్‌.ఆర్‌పై దృష్టి పెట్టాడు. బాలు పాడిన పాట తప్పితే అంత బాగాలేవు . ల‌డ‌ఖ్ నేప‌థ్యంలో సన్నివేశాల్ని బాగా  తెర‌కెక్కించారు. సాంకేతిక విలువ‌ల ప‌రంగా ఎక్క‌డా రాజీ తగ్గలేదు . డ‌బ్బుల్ని విచ్చ‌ల‌విడిగా ఖ‌ర్చు చేశారు. ఆనంద్ క‌థని బాగానే మొద‌లెట్టాడు. కాక‌పోతే.. ర‌వితేజ ఇమేజ్‌కి లోబ‌డి, క‌మ‌ర్షియ‌ల్ ట‌చ్ ఇచ్చుకుంటూ వెళ్లి, చివ‌రికి రొటీన్ . డ్రామా తీశాడు. ఫినిషింగ్ ట‌చ్‌: 5రాజువయ్యా డిస్కో రాజువయ్యా అయ్యాడు
kajol agarwal and samanta movies