మూవీ రివ్యూ: ప్రతిరోజూ పండగే
నటీనటులు: సాయి ధర్మతేజ్ , రాశి ఖన్నా, రావురమేష్ ,సుహాన్ ,సత్యరాజ్, తదితరులు
దర్శకత్వం: మారుతి
నిర్మాణం:అల్లు అరవింద్ ,బన్నీ వాసు
సంగీతం: ఎస్ ఎస్ థమన్
విడుదల తేదీ: డిసెంబర్ 20, 2020
రేటింగ్:2.5/5

సాయి ధర్మతేజ్ ఈ సరి ప్రతిరోజూ పండగే తో మనముందుకు వచ్చాడు లాస్ట్ మూవీ చిత్రలహరి మూవీతో ఫ్లోప్స్ లో నుంచి బైటపడి నట్టయినది మారుతి,బన్నీ వాసు తో కలిసి ప్రతిరొజూపండగే మూవీ  చేసాడు. కుటుంబ విలువలు, ప్రతిరోజూ మన జీవితం పండగలా మారాలంటే ఎలా అన్న కాన్సెప్ట్స్ తో తెరకెక్కిన ఈ చిత్రం ఈరోజే విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

కథ:
ఈ కథ ట్రైలర్ లో చూపించినదే. రఘురామయ్య (సత్యరాజ్) మనవళ్ళు, మనవరాళ్లు అందరూ యూఎస్, ఆస్ట్రేలియాలో సెటిల్ అయిపోతారు. ఇదిలా ఉంటే రఘురామయ్యకు లంగ్ క్యాన్సర్ ఉన్నట్లు తెలుస్తుంది. ఎక్కువ కాలం బ్రతకడని డాక్టర్లు చెబుతారు. ఈ నేపథ్యంలో తన తాతకు తీరకుండా ఉండిపోయిన కోరికలను తీర్చడానికి దిగుతాడు మన హీరో. అక్కడి నుండి కథ ఎలాంటి మలుపులు తీసుకుంది అన్నది మిగతా సినిమా.
నటీనటులు:
సాయి తేజ్ హుషారు  నటనతో మెప్పించాడు. సినిమా అంతటా యాక్టివ్  గా కనిపించాడు. ఎమోషనల్ సీన్లలో కూడా తేజ్ నటన ఆకట్టుకుంటుంది. రాశి ఖన్నా చూడటానికి బాగుంది. తనకు సరదాగా యాక్టీవ్ గా ఉండే పాత్ర పడింది. వందకు తొబై శాతం న్యాయం చేసింది. టిక్ టాక్ స్టార్ గా ఆమె మంచి కామెడీను పంచింది. గ్లామరస్ గానూ కనిపించింది. రావు రమేష్ ఈ సినిమాకే హైలైట్ అనదగ్గ పాత్ర చేసాడు. సినిమాలో సాయి తేజ్, సత్యరాజ్ మెయిన్ అనుకుంటాం కానీ  సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ రావురమేష్  అవుతాడు. సత్యరాజ్ తన పాత్రకు ప్రాణం  పోసాడు. కుటుంబ బంధాలను కోరుకునే చరమాంకంలోని వ్యక్తిగా సత్యరాజ్ ఆకట్టుకుంటాడు. మిగిలిన వారంతా బాగానే చేసారు

 

  1. సాంకేతిక వర్గం:
    థమన్ మంచి సంగీతాన్ని అందించాడు . పాటలు అన్నీ కూడా ఆకట్టుకునేలా లానే ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా మెప్పిస్తుంది. సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి మెయిన్ హైలైట్ గా నిలిచింది. ఫ్రేమ్స్ అన్నీ కలర్ గుల్ గా ఉన్నాయి. నిర్మాణ విలువలు అదిరిపోయాయి. సంభాషణలు మెప్పిస్తాయి. ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే ఎమోషనల్ డైలాగులు అందరినీ ఆలోజింపచేస్తాయి. యాక్షన్ సీక్వెన్స్ లు బాగా డిజైన్ చేసారు. సాయి తేజ్ కు కంపోజ్ చేసిన డ్యాన్సులు కూడా బాగున్నాయి. స్టోరీ లైన్ సింపుల్ గా ఉన్నా ఆసక్తికరంగా ఉంది. దర్శకుడు మారుతి దాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోలేదు అనిపిస్తుంది. హార్ట్ టచింగ్ మూమెంట్స్ మిస్ అయిన ఫీలింగ్ వస్తుంది.
విశ్లేషణ:
చిన్న స్టోరీని పెద్ద మలుపు తిప్పడం లో మారుతి మంచి మార్కులే కొట్టేడు . మొదటి హాఫ్ ను ఎంటర్టైనింగ్ వే లోనే నడిపించిన దర్శకుడు, సెకండ్ హాఫ్ లో ఒక స్టేజ్ వచ్చాక ఏం చేయాలో అర్ధం కానట్లు సినిమాను తీసుకెళ్లాడు. అటు కామెడీ వైపు వెళ్ళాలో, ఇటు సెంటిమెంటల్ గా సినిమాను ముందుకు తీసుకెళ్ళాలో తెలియక రెండిటికీ కాకుండా చేసేసాడు. ఏదేమైనా మొదటి హాఫ్ లో వచ్చే ఎంటర్టైన్మెంట్, సాంగ్స్, సెకండ్ హాఫ్ లో కొంత భాగం మెప్పిస్తాయి. మొత్తంగా ప్రతిరోజూ పండగే.. ఊహించినంత రేంజ్ లో లేకపోయినా ఒకసారి చూడవచ్చు.
kajol agarwal and samanta movies