నటీనటులు: వెంకటేష్, నాగ చైతన్య, రాశి ఖన్నా, పాయల్ రాజ్ పుత్, నాజర్, రావు రమేష్, ప్రకాష్ రాజ్ తదితరులు
దర్శకత్వం: బాబీ
నిర్మాత: సురేష్ బాబు, టీజీ విశ్వ ప్రసాద్
సంగీతం: థమన్ ఎస్ ఎస్
విడుదల తేదీ: డిసెంబర్ 13, 2019
రేటింగ్: 3/5

చాల కంప్యూజ్ అయ్యారు సురేష్ బాబు గారు ఈ మూవీ రిలీజ్ చెయ్యడానికి . రిలీజ్ డేట్ ఎంత ముఖ్యమో తెలుసు మూవీ రీలీజ్  అవ్వడానికి అయినా వేరే ఆప్షన్ లేకపోవడంతో డిసెంబర్ 13న అంటే ఈరోజే సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. రియల్ లైఫ్ లో మామ అల్లుళ్ళు అయిన వెంకటేష్ , నాగ చైతన్య వెంకీ మామలో అవే పాత్రలు పోషించడంతో సహజంగానే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి వాటిని వెంకీ మామ అందుకుందో లేదో చూద్దామా.

కథ:
కథగా చెప్పుకోవాలంటే ఇది చాలా సింపుల్. రామ నారాయణ (నాజర్) ఒక ఊరికి పెద్ద మనిషి. అలాగే జాతకాల మీద పట్టున్న వ్యక్తి. తన మనవడు కార్తీక్ (నాగ చైతన్య), తన కూతురు, అల్లుడు చావుకి అని నమ్ముతాడు రామ నారాయణ. దీంతో తల్లిదండ్రుల్లేని కార్తీక్ బాధ్యతలను తన మావయ్య (వెంకటేష్) తీసుకుంటాడు. తన మావయ్య దగ్గరే పెరిగి పెద్దవాడైన కార్తీక్, ఉన్నట్లుండి తన మావయ్యను వదిలేసి చెప్పాపెట్టకుండా వెళ్ళిపోతాడు. కార్తీక్ ఎక్కడికి వెళ్ళాడు? ఎందుకు తన మావయ్య నుండి దూరంగా వెళ్లిపోవాలనుకున్నాడు? ప్రాణంగా పెంచుకున్న ఆ మావయ్య ఏం చేసాడు? అన్నది మిగతా కథ.

నటీనటులు:
ఇది వెంకిమామ సినిమా అని చెప్పాలి ,ఇందులో వెంకటేష్ మెయిన్ హీరో, నాగచైతన్య సపోర్టింగ్ రోల్ చేసారు . అప్పుడు ఏదో వినయంగా ఆ మాట చెప్పడ నుకున్నాం కానీ అదే నిజం. ఇది పూర్తిగా వెంకీ సినిమానే. వెంకీ బలాల్ని నమ్ముకుని దర్శకుడు తీర్చిదిద్దిన సినిమా. వెంకటేష్ పైనే ఫోకస్ ఎక్కువ ఉంటుంది. ఇప్పటికే ఇలాంటి పాత్రల్ని ఎన్నో చేసేసిన వెంకీ, ఈ పాత్రను కూడా అవలీలగా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. కామెడీ, సెంటిమెంట్, యాక్షన్.. ఇలా అన్ని షేడ్స్ ను ది బెస్ట్ గా ప్రాజెక్ట్ చేసాడు. నాగ చైతన్యకు కొంచెం తక్కువ ప్రాధాన్యత కలిగిన పాత్ర వచ్చినా కూడా అతను మెప్పించాడు. నటుడిగా ప్రూవ్ నాగచైతన్య బాగా నటించాడని బాగా ప్రయత్నం చేసాడు అనుకోవాలి . ముఖ్యంగా వెంకటేష్, నాగ చైతన్య కెమిస్ట్రీ అదిరిపోయింది. రాశి ఖన్నా, పాయల్ రాజ్ పుత్ లకు దక్కిన పాత్రలు చెప్పుకునేంత గొప్పవి, పెద్దవి కావు. గ్లామర్ ఎడిషన్ కోసం ఉన్నారనిపిస్తుంది. ఆ రకంగా అయితే పూర్తి న్యాయం చేసారు. సీనియర్లైన నాజర్, రావు రమేష్, ప్రకాష్ రాజ్ తమకలవాటైన రీతిలో చేసుకుంటూ వెళ్లిపోయారు. మిగతా వాళ్లంతా మాములే.

సాంకేతిక వర్గం:
ప్రసాద్ మూరెళ్ళ అందించిన సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఇక విలేజ్ సెటప్ కూడా బాగా చూపించారు . ఇక ఆర్మీ సెటప్ కూడా విసుల్ల్స్ బాగున్నాయ్ . ఇంటర్వెల్ ఫైట్ చిత్రీకరించిన విధానం బాగుంది. రామ్-లక్ష్మణ్ కంపోజ్ చేసిన ఈ ఫైట్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. పాటలు వినడానికి ఓకే. ఒకట్రెండు పాటలు తప్ప మిగతావి యావరేజ్ గానే అనిపిస్తాయి. అయితే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు వంక పెట్టడానికి లేదు. తన స్టైల్ లో దుమ్ము దులిపాడు. ప్రవీణ్ పూడి ఎడిటర్ గా ఇంకా బెటర్ జాబ్ చేసి ఉండొచ్చనిపిస్తుంది. చాలా చోట్ల సీన్స్ లాగ్ ఉన్నాయి.కధ మొత్తం బొర్ గ నడుస్తుంది . పోనీ కథనం అయినా కొత్తగా ఉందా అంటే దాని ట్రీట్మెంట్ ఇంకా పాతకాలం నాటిది. బాబీ సినిమాల్లో మనకు ముందు నుండి ఉండే కంప్లైంట్ ఇదే. అటు పవర్ కానీ, ఇటు జై లవకుశ కానీ చాలా ఓల్డ్ స్టైల్ ట్రీట్మెంట్ ఇచ్చాడు. వెంకీ మామకు ఇదే ప్రాబ్లెమ్ వెంటాడింది.

 

చివరిగా:
కధ పరం గ చూసుకుంటే పాతదే ఆయన వెంకటేష్ నటనకి ఒక సరి చూడొచ్చు అనిపిస్తుంది . ముఖ్యంగా వెంకటేష్, నాగ చైతన్య స్క్రీన్ పై కనిపించినప్పుడు అటు ఫ్యాన్స్ కు ఇటు ప్రేక్షకులకు కనులపండువగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ రొటీన్ గానే సాగినా మెప్పిస్తుంది. ఇంటర్వెల్ బ్లాక్ తో ప్రేక్షకుల అంచనాలు పెరిగిపోతాయి. అయితే సెకండ్ హాఫ్ ను ఇంకా బెటర్ గా డీల్ చేసి ఉండాల్సింది. ఇక్కడ సెంటిమెంట్ బానే పండినా లాగ్ సీన్స్ ఎక్కువయ్యాయి. మళ్ళీ క్లైమాక్స్ మంచి హై తో ముగియడం ఈ చిత్రానికి ప్లస్. రొటీన్ స్టోరీ, ట్రీట్మెంట్ ను పక్కనపెట్టేస్తే.. చాలా కాలం తర్వాత ఒక పెద్ద సినిమా థియేటర్లకు వచ్చింది. సినిమాలకు మొహం వాచిపోయి ఉన్న ప్రేక్షకులకు ప్రస్తుతం బెస్ట్ ఆప్షన్ వెంకీ మామ.

పంచ్ లైన్: కొంచం అన్న వెరైటీ గా తీసుంటే బాగుండేది అబ్బా

kajol agarwal and samanta movies