సరిలేరు నీకెవ్వరు మూవీ రివ్యూ:
నటీనటులు: మహేషబాబు , రష్మిక, విజయశాంతి, ప్రకాశ్ రాజ్ , రాజేంద్ర ప్రసాద్, సంగీత తదితరులు
దర్శకత్వం: అనిల్ రావిపూడి
నిర్మాత: అనిల్ సుంకర, మహేష్ బాబు
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫీ: రత్నవేలు
విడుదల తేది: 11-01-2020
రేటింగ్: 3.5/5

సూపర్ స్టార్ మహేష్ బాబు మాస్ సినిమా చేసి చాలా రోజులైంది. గత కొన్ని చిత్రాలుగా ప్యాసివ్ రోల్స్ లోనే కనిపిస్తూ వచ్చిన మహేష్ బాబు పూర్తిగా యాక్టివ్ రోల్ చేసిన చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఆర్మీ మేజర్ గా మహేష్ నటించిన ఈ చిత్రం ఈరోజే విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దామా.see this link

కథ:

అజయ్ కృష్ణ (మహేష్ బాబు) సైన్యంలో మేజర్ గా పనిచేస్తుంటాడు. దేశం ముందు వేరేవి ఏవీ ముఖ్యంగా కాని తనకు అనుకోకుండా ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్ కు వెళ్లాల్సి వస్తుంది. అసలు అజయ్ కర్నూల్ ఎందుకు వెళ్ళాలి? అక్కడ తనకు ఎదురైన పరిస్థితులు ఏంటి? అక్కడ కొన్ని సమస్యల్లో ఇరుక్కున్న భారతి (విజయశాంతి)కి అజయ్ అండగా ఎలా నిలిచాడు అన్నది చిత్ర కథాంశం.

కథనం:
అనిల్ రావిపూడి సినిమా అంటే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈయన గత సినిమాలు చూసిన వాళ్లకు ఇది అర్థమైపోతుంది. ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు కూడా అంతే. ఆ ఫార్మాట్ ప్రకారం కథ రాసుకుని పక్కాగా దాన్ని స్క్రీన్ పై ప్రజెంట్ చేసాడు అనిల్. సూపర్ స్టార్ లాంటి హీరో దొరికినా కూడా ఎక్కడా ఆ బెరుకు మాత్రం లేకుండా.. కన్ఫ్యూజన్ లేకుండా తాను అనుకున్నది అనుకున్నట్లు చూపించాడు. కొత్త మహేష్ బాబును స్క్రీన్ పై చూపించాడు ఈ కుర్ర దర్శకుడు. అప్పట్లో శ్రీనువైట్ల దూకుడు సినిమాకు మహేష్ బాబును ఎంతగా వాడేసాడో అంతకంటే ఎక్కువే ఇందులో వాడుకున్నాడు అనిల్. ఫస్ట్ సీన్ నుంచి చివరి వరకు మహేష్ ఎనర్జీ సినిమాకు హైలైట్. ముఖ్యంగా సినిమా మొదట్లోనే వచ్చే కశ్మీర్ ఎపిసోడ్ సినిమాకు ప్రాణం. తన సినిమా ప్లాట్ అక్కడే చెప్పేసాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ఓ సోల్జర్ సొసైటీకి వచ్చినపుడు అతడికి ఇక్కడున్న గొడవలు.. వివాదాలు అన్నీ చాలా చిన్నగా కనిపిస్తాయి. అదే కారెక్టరైజేషన్‌తో సినిమా అంతా నడిచింది. కశ్మీర్ నుంచి వచ్చేటప్పుడు దారిలో వచ్చే ట్రైన్ ఎపిసోడ్ సినిమా బాగుంది. కానీ మరీ ముందు నుంచి చెప్పినంత హైలైట్ మాత్రం కాదు. అప్పటి వరకు యాక్షన్ సినిమా చూసిన ప్రేక్షకులను కామెడీ వైపు మళ్లించాడు అనిల్. అరగంటకు పైగానే బాగానే నవ్వించాడు. ఎక్కడా డ్రాప్ అవ్వకుండా నాన్ స్టాప్ కామెడీ పంచులతో పిచ్చెక్కించాడు అనిల్ రావిపూడి. సంగీత, రష్మిక, బండ్ల గణేష్ బ్యాచ్‌తో కలిసి మహేష్, రాజేంద్ర ప్రసాద్ కూడా కుమ్మేసారు. అబ్బాబాబాబా అంటూ సూపర్ స్టార్ చెప్పిన ఒక్క డైలాగ్ థియేటర్స్‌‌లో నవ్వులు పూయించింది. కామెడీ ఎంత ఉన్నా కూడా రొటీన్ కథ ఒక్కటే సరిలేరు నీకెవ్వరుకు మైనస్ అవుతుంది.
అక్కడక్కడా కథ ముందుకెళ్లనని మొరాయించినా కూడా ఓవరాల్‌గా చూసుకుంటే మాత్రం ఫక్తు కమర్షియల్ సినిమాతో వచ్చేసాడు అనిల్ రావిపూడిసెకండాఫ్ కాస్త ల్యాగ్ అయినట్లు అనిపించినా కూడా మాస్ ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యే బలమైన సన్నివేశాలు కొన్ని ఉన్నాయి. దాంతో పాస్ అయిపోవచ్చు .సెకండాఫ్ అంతా విజయశాంతి కోణంలోనే సాగుతుంది. ఆమె పాత్రకు చాలా ప్రాముఖ్యత ఇచ్చాడు అనిల్. ముఖ్యంగా ప్రకాశ్ రాజ్ ఇంటికి వచ్చే సీన్ మహేష్ హీరోయిజంతో పాటు విజయశాంతిలోని నటికి కూడా చాలా పని చెప్పింది.ఇంటర్వెల్ ముందు వరకు తన స్ట్రెంత్ కామెడీని నమ్ముకున్న అనిల్ అక్కడ్నుంచి అసలు కథలోకి వెళ్లిపోయాడు మాస్ ప్రేక్షకులు కోరుకునే ఫైట్ సీక్వెన్సులతో పాటు వార్నింగ్ సన్నివేశాల్లో కూడా మహేష్ బాబు తన సోల్జర్ గుణాన్ని చూపించి జాలి చూపించడం కొత్తగా అనిపిస్తుంది. రాజకీయ నాయకులపై మహేష్ బాబు వేసిన పంచ్ డైలాగులు అదిరిపోయాయి… ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ సినిమాకు మరో హైలైట్. విజయశాంతి, మహేష్ మధ్య డిజైన్ చేసిన సీన్స్ అన్నీ బాగానే ఉన్నాయి.

 

నటీనటులు:

ఇప్పటి వరకు తాను చేసిన సినిమాల్లో సరిలేరు నీకెవ్వరు డిఫెరెంట్ అని చెబుతూనే ఉన్నాడు మహేష్ బాబు. యాక్షన్ సన్నివేశాల్లో తేడా కనిపించలేదు కానీ కామెడీ టైమింగ్‌లో మాత్రం కొత్త మహేష్ కనిపించాడు. అభిమానులు దాన్ని చూసి ఫుల్ ఎంజాయ్ చేయడం ఖాయం. దానికితోడు చాలా ఏళ్ళ తర్వాత డాన్సులు కూడా కుమ్మేసాడు. మైండ్ బ్లాక్ సాంగ్ ఫ్యాన్స్‌కు ఫీస్ట్. నటుడిగా ఇంకా ఇంకా ఎదిగాడు సూపర్ స్టార్. రష్మిక మందన్న క్యూట్ యాక్టింగ్‌తో మెప్పించింది. విజయశాంతి చాలా రోజుల తర్వాత స్క్రీన్‌పై చాలా హూందాగా కనిపించింది. ఆమె పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంది. ప్రకాశ్ రాజ్ మరోసారి విలన్ పాత్రలో రప్ఫాడించాడు. రాజేంద్ర ప్రసాద్ కారెక్టర్ ఫుల్ లెంత్ ఉంది. సంగీతతో పాటు మిగిలిన పాత్రలు కూడా బాగున్నాయి.

టెక్నికల్ టీం:
రత్నవేలు సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రాణం. కశ్మీర్ అందాలతో పాటు యాక్షన్ సీన్స్ కూడా చాలా బాగా చూపించాడు. సినిమా అంతా ఆ రిచ్ నెస్ కనిపించింది. ఇక దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం బాగుంది. పాటల కంటే బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరింది. విజువల్‌గా మైండ్ బ్లాక్ పాట చాలా బాగా కుదిరింది. ఇక ఎడిటింగ్ ఓకే.. సెకండాఫ్ కాస్త ల్యాగ్ అయినట్లు అనిపించింది. దర్శకుడు అనిల్ రావిపూడి మరోసారి తన బలాన్ని చూపించాడు. వినోదంతో పాటు యాక్షన్ కూడా నింపి పక్కా కమర్షియల్ సినిమా ఇచ్చాడు. రొటీన్ కథే అయినా కూడా అభిమానులను మెప్పించేలా తెరకెక్కించడంలో ఈ కుర్ర దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఇప్పటి వరకు మీడియం బడ్జెట్ సినిమాలు చేస్తూ వచ్చిన అనిల్.. తొలిసారి స్టార్ హీరో తగిలినా కూడా ఎలాంటి బెరుకు లేకుండా సరిలేరు నీకెవ్వరుతో వచ్చిన అవకాశం రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు అనిల్ రావిపూడి. ముఖ్యంగా కామెడీ సన్నివేశాలు సినిమాకు హైలైట్.

kajol agarwal and samanta movies